సంక్షోభం తొలగించకుంటే అవిశ్వాసం: శ్రీలంక ప్రభుత్వానికి హెచ్చరిక

by Disha Web Desk 17 |
సంక్షోభం తొలగించకుంటే అవిశ్వాసం: శ్రీలంక ప్రభుత్వానికి హెచ్చరిక
X

కొలంబో: శ్రీలంక ప్రభుత్వానికి విపక్షాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అవిశ్వాస తీర్మానానికి మొగ్గుచూపుతామని అన్నారు. సామగి జన బలవేగయ పార్టీ చీఫ్ సాజిత్ ప్రేమదాస పార్లమెంట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక దిగుమతులకు సరిపడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంది. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన, ఆహార, విద్యుత్ కొరతలు పెరిగాయి. గత నెల రోజులుగా ప్రజలు వీధుల్లో చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. వీరిని నియంత్రించేందుకు ప్రభుత్వం అత్యవసర పరిస్థితితో పాటు కర్ఫ్యూ విధించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

తాజాగా మంత్రులు అందరూ మూకుమ్మడి రాజీనామాలు కూడా ప్రభుత్వాన్ని బలహీనం చేశాయి. అయితే ప్రభుత్వం విపక్షాలతో కలసి పార్టీ ఏర్పాటుకు ఆహ్వానించింది. 'ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని అదుపులోకి తీసుకువచ్చి పరిపాలనను మెరుగుపరుచుకోవాలి. లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తీసుకొస్తాం' అని ప్రేమదాస అన్నారు. శ్రీలంక తప్పనిసరిగా క్రమరహిత రుణ ఎగవేతను నివారించడం అత్యవసరమని ఆయన అన్నారు. మరోవైపు శ్రీలంక దిగ్గజ వ్యాపార సంస్థలు కూడా అంతర్జాతీయ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్‌లను ఆర్థిక సాయం కోరాలని ప్రభుత్వంతో వాదించాయి.


Next Story

Most Viewed