- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సేంద్రీయ ఉత్పత్తుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్ : మంత్రి తుమ్మల
ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయించుకోవటానికి టీజీ ఆర్గానిక్స్ యాప్ ను అందుబాటులో తీసుకొచ్చినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : సేంద్రీయ దృవీకరణ పొందిన రైతుల ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయించుకోవటానికి మార్కెటింగ్ సౌకర్యాలను అందించడంలో భాగంగా టీజీ ఆర్గానిక్స్ యాప్ ను అందుబాటులో తీసుకొచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ ర రావు తెలిపారు. ఈనెల 4వ తేదీన ఆర్గానిక్స్యాప్ప్రారంభించనున్నట్లు చెప్పారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫైడ్ ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేసే వారు నేరుగా టీజీ ఆర్గానిక్స్ మొబైల్ యాప్ ద్వారా రైతులను సంప్రదించి నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. రాష్ట్రంలో సేంద్రీయ దృవీకరణ పద్దతి, టీజీ ఆర్గానిక్స్ మొబైల్ ద్వారా మార్కెట్ లో ఇబ్బడిముబ్బడిగా నకిలీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ నియంత్రించే అవకాశం ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టి, తగిన చర్యలు కూడా తీసుకుంటుంది. యాప్ ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేయాలంటే కస్టమర్లు ఎవరైనా ప్లే స్టోర్ నుంచి ఆర్గానిక్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. మొదటగా తమకు కావలసిన పంటల గ్రూపును, పంట ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలి. తరువాత వచ్చే రైతుల వివరాల ద్వారా నేరుగా వారిని సంప్రదించి ఉత్పత్తులు కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో తమకు 50 కిలోమీటర్ల పరిదిలో ఉండే రైతుల వివరాలు మొదటగా వస్తాయి, ఒకవేళ పరిధిని తగ్గించుకోవటం, పెంచుకోవటం చేసుకోవచ్చు. యాప్ లో ప్రత్యేకలు ఉన్నాయని, ప్రస్తుతం దాదాపు 500 మంది రైతులు యాప్ లో ఉన్నారు. తెలంగాణలో సేంద్రీయ దృవీకరణ సేవలు ఇస్తున్న ఇతర రీజినల్ కౌన్సిల్స్ అయిన ఏకలవ్య ఫౌండేషన్, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ తో ఇతర ఆర్సీలకు చెందిన ఆర్గానిక్ రైతుల వివరాలు కూడా ఈ యాప్ లో పొందుపరచడం జరుగుతుంది.
సుమారు 100 కు పైగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఈ యాప్ లో కస్టమర్లకు అందుబాటులో ఉంచడం జరిగింది. రైతు మొబైల్ నంబర్, చిరునామా, లొకేషన్ వివరాలు పొందవచ్చు. రైతు వద్ద అందుబాటులో ఉన్న దృవీకృంచిన వివిధ ఆర్గానిక్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ దృవీకరణ అథారిటీ ద్వారా సేంద్రీయ దృవీకరణ సర్టికెట్లు పొందిన రైతుల వివరాలు మాత్రమే యాప్ లో ఉంటాయి. చివరగా ఈ యాప్ ద్వారా కేవలం ఆర్గానిక్ రైతు వివరాలు అతన వద్ద అందుబాటులో ఉండే ప్రొడక్ట్స్ వివరాలు మాత్రం ఈ యాప్ లో ఉంచడం జరిగింది. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ రేటు ను నిర్ణయించే అధికారం రైతుకు మాత్రమే ఉంటుంది.






