టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా జోరు.. యూఏఈపై ఘనవిజయం

by Malleboina Mahesh |

టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా జైత్రయాత్ర కొనాసుగోంది. యూఏఈపై గెలుపుతో అజేయంగా సూపర్-8లోకి ఎంట్రీ ఇచ్చింది. మార్క్రామ్, బ్రెవిస్ మెరుపులతో గ్రూప్ దశలో వరుసగా నాలుగో విజయం నమోదు.

టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా జోరు.. యూఏఈపై ఘనవిజయం
X

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జోరు కనబరుస్తుంది. ఈ రోజు గ్రూప్స్ స్టేజ్ లో భాగంగా యూఏఈతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు తిరుగులేని ప్రదర్శన చేశారు. వర్షం కారణంగా ఆట కాసేపు నిలిచిపోయినప్పటికీ, దక్షిణాఫ్రికా విజయంపై అది ఎలాంటి ప్రభావం చూపలేదు. యూఏఈ నిర్దేశించిన 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో సఫారీ బ్యాటింగ్ లైనప్‌కు పెద్దగా కష్టం కలగలేదు. కెప్టెన్ మార్క్రామ్, రికిల్టన్‌లు బాధ్యతాయుతంగా ఆడగా, యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ తన దూకుడుతో మ్యాచ్‌ను త్వరగా ముగించాడు.

యూఏఈ బౌలర్లు నాలుగు వికెట్లు పడగొట్టినప్పటికీ, అవి దక్షిణాఫ్రికా బ్యాటర్లు భారీ షాట్లకు ప్రయత్నించి అవుట్ అవ్వడం వల్ల వచ్చినవే తప్ప, బౌలింగ్ నైపుణ్యంతో వచ్చినవి కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయంతో గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన దక్షిణాఫ్రికా, పూర్తి ఆత్మవిశ్వాసంతో సూపర్-8 పోరుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే యూఏఈ జట్టు నాలుగు మ్యాచుల్లో ఒక విజయంతో నాలుగో స్థానంతో సరిపెట్టుకొని టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.

Next Story