నీ బండారం బయటపెడతా.. నటుడిపై సోమీ షాకింగ్ కామెంట్స్

by Dishafeatures2 |
నీ బండారం బయటపెడతా.. నటుడిపై సోమీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్‌ నటి 'సోమీ అలి' హాలీవుడ్ నటుడు 'హార్వే వైన్‌స్టీన్‌'పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసిన సోమీ.. హార్వే పెద్ద కామాంధుడు, తొందరలోనే అతడి బండారం బయటపడతానంటూ కాంట్రవర్సీకి తెరలేపింది. కొంతమంది అనుకున్నట్లు అతడేమీ సక్కనిపూసక కాదని, ఎంతోమంది మహిళలను వేధించాడని, ఆ నిజాలేంటో త్వరలోనే ఈ ప్రపంచానికి తెలుస్తాయని చెప్పింది.

అంతేకాదు అతడు లైంగికంగా హింసించిన మహిళలందరూ ఏదో ఒకరోజు నిజాన్ని నిర్భయంగా బయటపెడతారని చెప్పిన సోమీ.. ఈ విషయంలో ఐశ్వర్యరాయ్‌ను ట్యాగ్ చేయడమే కాకుండా సల్మాన్‌ ఖాన్‌ నటించిన 'ఆతే జాతే హస్తే గాతే' అనే సాంగ్‌ స్టిల్‌ను యాడ్ చేయడం విశేషం. ఇక వైరల్ అవుతున్న పోస్ట్‌పై స్పందించిన 'నిక్కీ చావ్లా'.. 'ఆ అమ్మాయిలందరూ ఎలాంటి మానసిక క్షోభకు గురై ఉంటారో ఒక్క క్షణం కూడా ఊహించలేము. వాళ్లకు మద్ధతుగా నీ గొంతు విప్పినందుకు ధన్యవాదాలు' అంటూ సపోర్టుగా నిలిచింది. అయితే కారణమేంటో తెలియదు కానీ సోమీ ఈ పోస్ట్‌ను ప్రస్తుతం డిలీట్ చేసింది.

Next Story

Most Viewed