- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాను కమ్మేసిన ‘ఫెర్న్’ మంచు తుపాను.. ఏకంగా 8 వేల విమాన సర్వీసులు రద్దు
‘ఫెర్న్’ (Winter Storm Fern) మంచు తుపాను అగ్ర రాజ్యం అమెరికా (America)ను అతలాకుతలం చేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఫెర్న్’ (Winter Storm Fern) మంచు తుపాను అగ్ర రాజ్యం అమెరికా (America)ను అతలాకుతలం చేస్తోంది. ఈ భీకర తుపాను కారణంగా పలు రాష్ట్రాల్లో జనజీవనం ఎక్కడికక్కడే స్తభించిపోయింది. ముఖ్యంగా విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. శని, ఆదివారాల్లో కలిపి ఇప్పటి వరకు సుమారు 8 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు అయినట్లుగా ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘ఫ్లైట్ అవేర్’ (Flight Aware) అధికారికంగా ప్రకటించింది. మంచు ఐస్ కారణంగా రన్‌వేలు ప్రమాదకరంగా మారడంతో ఎయిర్‌లైన్స్ ముందస్తుగా పలు విమానయాన సంస్థలు ఫ్లైట్స్‌ను నిలిపివేశాయి. ముఖ్యంగా డల్లాస్, ఫోర్ట్‌వర్త్, ఓక్లహోమా సిటీ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. డెల్టా, అమెరికన్, యునైటెడ్ వంటి విమానయాన సంస్థలు ప్రయాణికులకు టికెట్ రీబుకింగ్ కోసం ప్రత్యేక వెసులుబాటు కల్పించాయి.
ఆ రెండు సిటీలపై తుపాను ప్రభావం
కాగా, ప్రస్తుతం ఫెర్న్ మంచు తుపాను టెక్సాస్ (Texas), ఓక్లహోమా (Oklahoma) రాష్ట్రాల తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు రహదారులపై అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బలమైన గాలుల వల్ల చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో వేల సంఖ్యలో ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పోలీసులు, వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
Read More..






