- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FD లపై అదిరిపోయే వడ్డీ.. అధిక రాబడిని అందిస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు
"FDలపై భారీ వడ్డీ! సూర్యోదయ్ బ్యాంక్‌లో 7.90%, ఉజ్జీవన్ 7.45%, SBM 7.30% వరకు వడ్డీ రేట్లు. ప్రభుత్వ బ్యాంకుల్లో పంజాబ్ & సింధ్ 6.75% తో టాప్."

దిశ, వెబ్ డెస్క్: నేటి సమాజంలో చాలామంది తమ కష్టార్జితాన్ని రిస్క్ లేని చోట దాచుకోవాలని అనుకుంటారు. మార్కెట్ ఒడిదుడుకులు (షేర్ మార్కెట్ లాంటివి) తాకకూడని, కచ్చితమైన రాబడి ఇచ్చే మార్గం కోసం ఎఫ్‌డీని ఎంచుకుంటారు. ముఖ్యంగా పిల్లల చదువులు, పెళ్లిళ్లు, రిటైర్మెంట్ అవసరాల కోసం ఈ పొదుపు చేస్తుంటారు. కానీ కొంత మందికి ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎక్కడ పెట్టాలి, ఏ బ్యాంకులు అధిక వడ్డీ అందిస్తున్నాయే తెలియక సతమతమవుతారు. అలాంటి వారికి ఈ సమాచారం ఎంతో వెసులుబాటు కలిగిస్తుంది. తాజా నివేదికల ప్రకారం.. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు FD పై అదిరిపోయే వడ్డీతో పాటు అధిక రాబడిని అందిస్తున్నాయి.
FDలపై అదిరిపోయే వడ్డీ
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సురక్షితమైన పెట్టుబడిగా భావించే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FDs) వివిధ బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. తాజా డేటా ప్రకారం, ప్రధాన బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులే అధిక వడ్డీని ఆఫర్ చేస్తూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5 ఏళ్ల కాలపరిమితిపై అత్యధికంగా 7.90% వడ్డీని ఇస్తుండగా, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండేళ్ల కాలానికి 7.45% వడ్డీని అందిస్తోంది. గ్యారెంటీ రిటర్న్స్ ఆశించే వారికి ఈ బ్యాంకులు ఉత్తమ వేదికగా మారుతున్నాయి.
ప్రైవేటు రంగంలో చూస్తే, SBM బ్యాంక్ 18 నెలల నుంచి రెండేళ్ల కాలపరిమితి గల డిపాజిట్లపై 7.30% వడ్డీని అందిస్తూ ముందంజలో ఉంది. RBL బ్యాంక్ కూడా 18 నెలల నుంచి 3 ఏళ్ల కాలానికి 7% వరకు వడ్డీని చెల్లిస్తోంది. ఇక ప్రభుత్వ రంగ (Public Sector) బ్యాంకుల్లో కూడా వడ్డీ రేట్లు పోటీ పడుతున్నాయి. పంజాబ్ & సింధ్ బ్యాంక్ 666 రోజుల డిపాజిట్‌పై 6.75%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 450 రోజుల కాలపరిమితిపై (స్టార్ స్వర్ణిమ్ పథకం) 6.70% హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లను కల్పిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు ఈ రేట్లు సాధారణం కంటే మరో 0.50% వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది.
ఒక చిన్న సూచన
ఎఫ్‌డీలో లాభాలు ఉన్నట్లే నష్టాలు కూడా ఉంటాయి. గడువు తీరకముందే డబ్బులు విత్ డ్రా చేస్తే బ్యాంకులు కొంత మొత్తాన్ని పెనాల్టీ (ముందస్తు ఉపసంహరణ రుసుము) రూపంలో కోత విధిస్తాయి. అలాగే ఎఫ్‌డీ ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం ఒక పరిమితి దాటితే దానిపై పన్ను (TDS) పడుతుంది. దీనిని కస్టమర్ భరించాల్సి ఉంటుంది.






