ప్రధాని మోడీ పర్యటనలో స్వల్ప మార్పు!

by Muthe.Rajitha |

దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

ప్రధాని మోడీ పర్యటనలో స్వల్ప మార్పు!
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నేడు ఉదయం హెచ్‌ఐసీసీ (HICC) లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసారు.హెచ్‌ఐసీసీ సమావేశం ముగిసిన వెంటనే ప్రధాని మోడీ, గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీసిన అనంతరం, అక్కడి నుంచి నేరుగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కొద్దిసేపు సరదాగా గడిపిన ప్రధాని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినట్లు సమాచారం.

షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

నిజానికి పవన్, చంద్రబాబులతో భేటీ అనంతరం ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి అక్కడ వేచి ఉన్న బీజేపీ శ్రేణులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. అయితే, సమయాభావం కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న ప్రధాని, నేరుగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటున్నారు. కార్యకర్తలతో సమావేశం కంటే బహిరంగ సభకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్స్ జనసంద్రంగా మారింది. ప్రధాని రాక దృష్ట్యా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా, నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Next Story