- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ ఇంటిగోడకు నోటీసులు అంటించిన సిట్ అధికారులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మరోసారి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)కు మరోసారి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం రాత్రి నందినగర్‌లోని నివాసానికి వెళ్లారు. అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లారు. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అనంతరం సిట్ అధికారులు అక్కడ మీడియాతో మాట్లాడారు. తమ రికార్డ్స్‌లో నందినగర్ నివాసానికి సంబంధించిన అడ్రస్సే ఉందని అన్నారు. ఫామ్‌హౌజ్ అడ్రస్ లేదు కాబట్టి అక్కడ విచారించడం కుదరదు. విచారణ సమయంలో ఉపయోగించే పరికరాలను కూడా ఫామ్‌హౌజ్‌కు తీసుకెళ్లలేమని పేర్కొన్నారు. అయితే.. ఎర్రవెల్లిలో ఫామ్‌హౌజ్‌లో తనను విచారించాలని కేసీఆర్ కోరిన విజ్ఞప్తి సిట్ అధికారులు తిరస్కరించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇదే కేసులో ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను కూడా సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. కేసీఆర్ విచారణ అనంతరం తుది ఛార్జిషీట్ దాఖలు చేయనుంది.






