ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. హరీష్ రావుకు సిట్ నోటీసులు

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-19 15:24:20  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. హరీష్ రావుకు సిట్ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు(Harish Rao)కు సిట్ నోటీసులు(SIT Notices) ఇచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. హరీష్ రావు పాత్రపై ఓ ప్రయివేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా, ఇటీవలే ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు విచారణపై దర్యాప్తు సంస్థను ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతి ఇచ్చామని గుర్తు చేస్తూ.. ఇంకెంత కాలం ఇంటరాగేషన్ కొనసాగిస్తారు? ఈ కేసులో ఇంకా ఏం మిగిలుంది? అంటూ స్పష్టమైన ప్రశ్నలు సంధించింది. ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్‌ను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించిన కోర్టు.. దర్యాప్తునకు సహకరిస్తారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.

Next Story