- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో సిట్ విచారణ.. తెలంగాణ భవన్‌కు బయల్దేరిన KTR, హరీశ్‌రావు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అగ్రనేతలకు వరుస నోటీసులతో రోజుకో మలుపు తిరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో అగ్రనేతలకు వరుస నోటీసులతో రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణకు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఫిర్యాదులపై సిట్ అధికారులు ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే నిన్న కేటీఆర్ నివాసానికి వెళ్లిన అధికారులు, ఆయనకు 160 సీఆర్‌పీసీ (160 CRPC) కింద నోటీసులు జారీ చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఏసీపీ కార్యాలయంలో విచారణకు రావాలని కోరారు. కాగా, ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును సుమారు 7 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు, ఇప్పుడు కేటీఆర్‌ను ప్రశ్నించి సమాధానాలు రాబట్టనున్నారు.
కేటీఆర్ నివాసానికి పోటెత్తిన BRS శ్రేణులు..
కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారనే సమాచారంతో నందినగర్ (Nandi Nagar)లోని ఆయన నివాసానికి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. కేటీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణులు అక్కడికి తరలివచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ బీఆర్ఎస్ నేతలు ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపేనని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం కేటీఆర్, హరీశ్ రావు (Harish Rao)తో కలిసి తన నివాసం నుంచి తెలంగాణ భవన్‌కు బయలుదేరారు. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయిన అనంతరం, అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌తో సిట్ విచారణాకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Read More..






