- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్‌ఎస్ కీలక సమావేశం
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్‌ఎస్ అగ్రనేతలు కీలక సమావేశం నిర్వహించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

దిశ, ములుగు : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్‌ఎస్ అగ్రనేతలు కీలక సమావేశం నిర్వహించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హరీష్ రావును సిట్ అధికారులు విచారించగా, శుక్రవారం కేటీఆర్ కూడా సిట్ ఎదుట హాజరుకావాలని నోటీసులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణను రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి, పార్టీపై వచ్చే విమర్శలను ఎలా తిప్పికొట్టాలి అనే అంశాలపై నేతలు లోతైన చర్చ జరిపినట్లు సమాచారం. అలాగే సిట్ విచారణ నేపథ్యంలో పార్టీ వ్యూహం, మీడియా వ్యవహారం, ప్రజల్లోకి వెళ్లాల్సిన సందేశాలపై స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతం, క్యాడర్‌ను ఉత్సాహపరచడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే రాజకీయ కార్యాచరణపై కూడా నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ బీఆర్‌ఎస్ రాజకీయ వ్యూహానికి కీలకంగా మారిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.






