ఇక ‘సూపర్ చాట్‌బాట్’‌గా సిరి.. గూగుల్ జెమినితో యాపిల్ కొత్త AI

by Kema Shiva Kumar |

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ తన వాయిస్ అసిస్టెంట్ ‘సిరి’ (Siri) రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు సన్నద్ధమవుతోంది.

ఇక ‘సూపర్ చాట్‌బాట్’‌గా సిరి.. గూగుల్ జెమినితో యాపిల్ కొత్త AI
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ తన వాయిస్ అసిస్టెంట్ ‘సిరి’ (Siri) రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటి వరకు కేవలం చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానమిచ్చే సిరిని, ఇకపై చాట్‌ జీపీటీ (ChatGPT), గూగుల్ జెమిని తరహాలో పూర్తి స్థాయి AI చాట్‌బాట్‌గా మార్చబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘కాంపొస్’ (Campos) పేరుతో కొత్త ప్రాజెక్ట్ యాపిల్ అంతర్గతంగా ఈ మెగా అప్‌డేట్‌ను ‘కాంపొస్’ అనే కోడ్ నేమ్‌తో పిలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సిరి పరిమితులను అధిగమించి, యూజర్లతో సహజంగా సంభాషించడం, అడిగిన విషయాలపై సుదీర్ఘ చర్చలు చేయడం దీని స్పెషాలిటీ ప్రత్యేకత.

కొత్త ‘సిరి’ చేసే పనులివే..

ఈ కొత్త అప్‌డేట్ iOS 27, iPad OS 27. mac OS 27 వెర్షన్లలో రానుంది. 2026 జూన్‌లో జరిగే యాపిల్ వార్షిక డెవలపర్ల సదస్సు (WWDC)లో దీనిని అధికారికంగా ప్రదర్శించి, సెప్టెంబర్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. కొత్త సిరి కేవలం సమాధానాలు చెప్పడమే కాకుండా.. వ్యాసాలు రాయడం, బొమ్మలు గీయడం (Image Generation), పెద్ద డాక్యుమెంట్లను క్లుప్తంగా వివరించడం వంటి పనులు చేయనుంది. అదేవిధంగా ఫోన్ స్క్రీన్‌పై ఏముందో సిరి చెప్పగలదు.

ప్రైవసీకి ఫస్ట్ ప్రియారిటీ..

ఈ సరికొత్త చాట్‌బాట్ అనుభవం కోసం యాపిల్ గూగుల్ జెమిని (Gemini) మోడల్స్‌ను వాడుకోనుంది. క్లౌడ్ సర్వర్ల విషయంలో కూడా గూగుల్ సాయం తీసుకోబోతుండటం విశేషం.ఇక ప్రైవసీకి పెద్దపీట యూజర్ల వ్యక్తిగత సమాచారం విషయంలో యాపిల్ కఠినమైన నిబంధనలు పాటించనుంది. చాట్‌బాట్ పాత సంభాషణలను ఎంతవరకు గుర్తుంచుకోవాలనే విషయంలో యూజర్లకే నియంత్రణ ఇచ్చేలా యాపిల్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దిగ్గజ మొబైల్ సంస్థలు సామ్‌సంగ్, గూగుల్ వంటి కంపెనీలు ఇప్పటికే తమ ఫోన్లలో అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లను ప్రవేశపెట్టిన నేపథ్యంలో యాపిల్ తీసుకొస్తున్న ఈ మార్పు టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story