- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవగాహనలేని సిబ్బందితో SIR సర్వే
SIR కార్యక్రమం తూతూ మంత్రం నిర్వహిస్తున్నారని, సరైన అవగాహన లేని సిబ్బందిని, స్వీపర్లను బీఎల్ఓలు గా నియమించారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం తూతూ మంత్రం నిర్వహిస్తున్నారని, సరైన అవగాహన లేని సిబ్బందిని, స్వీపర్లను బీఎల్ఓలు గా నియమించారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో జరుగుతున్న తప్పిదాలను వివరిస్తూ ప్రధాన ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్లకు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని లేఖ రాశారు. ఆ లేఖలను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కు అందజేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇంటింటికి తిరిగి సర్వే చేయడంలేదని, యాప్ లో వివరాలు నమోదు చేయడం, మ్యాపింగ్ పై సిబ్బందికి కొంతమందికి అవగాహన లేదని ఈ సందర్భంగా కమిషనర్ కు పవన్ కుమార్ గౌడ్ వివరించారు. కొంతమంది సిబ్బంది ఎస్ఐఆర్ కార్యక్రమం పక్కన పెట్టి జనాభా గణన నిర్వహిస్తున్నారని, దీంతో ప్రజలు కొంత గందరగోళనకు గురవుతున్నారని వివరించారు.
బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ లతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకువచ్చారని, ఈ నేపథ్యంలో లేఖలను పంపినట్లు కమిషనర్ కు పవన్ కుమార్ గౌడ్ వివరించారు. జనాభా గణన నిర్వహిస్తారా? లేక ఎస్ఐఆర్ కార్యక్రమం ముందుగా నిర్వహిస్తారా? అనే విషయాన్ని ప్రకటించి బీఎల్ఓలు, ఓటర్ల అయోమయాన్ని తొలగించాలని కోరారు. కమిషనర్ ను కలిసిన వారిలో బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు శైలేందర్, ముక్కా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.






