- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ విజేత సిన్నర్
టెన్నిస్ ప్రపంచంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న ఇటలీ స్టార్ ప్లేయర్ జనిక్ సిన్నర్ 2026 వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ విజేతగా నిలిచాడు.

దిశ, వెబ్ డెస్క్ : టెన్నిస్ ప్రపంచంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న ఇటలీ స్టార్ ప్లేయర్ జనిక్ సిన్నర్ (Jannik Sinner) తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ 2026 వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ విజేతగా నిలిచాడు. ప్రతిష్టాత్మక లండన్ సెంటర్ కోర్టులో జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో సిన్నర్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరోవ్‌ను 6–7, 7–6, 6–3, 6–4 తేడాతో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ ఆరంభంలో మొదటి సెట్‌ను టైబ్రేకర్ ద్వారా జ్వెరెవ్‌కు చేజార్చుకున్నప్పటికీ, సిన్నర్ పట్టుదలతో పోరాడి రెండో సెట్ టైబ్రేకర్ గెలిచి మ్యాచ్‌లోకి పుంజుకున్నాడు. ఆ తర్వాతి రెండు సెట్లలో తన మార్క్ షాట్లతో పూర్తి ఆధిపత్యం చలాయించి విజేతగా నిలిచాడు.
ఈ విజయంతో యానిక్ సిన్నర్ వింబుల్డన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా గతేడాది తన టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకున్నట్లయింది. సిన్నర్ కెరీర్‌లో ఇది రెండో వింబుల్డన్ ట్రోఫీ కాగా, మొత్తం మీద అతని ఖాతాలో చేరిన 5వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న సిన్నర్, ఈ గెలుపుతో గ్రాస్ కోర్టుపై తనకున్న పట్టును మరోసారి నిరూపించుకున్నాడు. మరోవైపు రన్నరప్‌గా నిలిచిన జ్వెరెవ్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, కీలక సమయాల్లో సిన్నర్ ప్రదర్శించిన మానసిక దృఢత్వం ముందు నిలవలేకపోయాడు. టెన్నిస్ అభిమానులను ఎంతగానో అలరించిన ఈ ఫైనల్ మ్యాచ్, సిన్నర్ కెరీర్‌లో మరో అద్భుత మైలురాయిగా నిలిచిపోతుంది.






