- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్థరాత్రి పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది సజీవ దహనం
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఒక రద్దీగా ఉండే పబ్‌లో ఒక్కసారిగా అంటుకున్న భారీ మంటల కారణంగా 27 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటికి వరకు 27 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. అలాగే మంటల్లో చిక్కుకుని గాయపడిన మరికొంత మందిని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించామని, వారికి మెరుగైన వైద్యం అందుతోందని మీడియాకు వెల్లడించారు. పబ్‌లో మంటలు చెలరేగడానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.






