- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో వివాదంలో సింగర్ మంగ్లీ!
ఇటీవల వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న సింగర్ మంగ్లీ మెడకు మరో వివాదం చుట్టుకుంటోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న సింగర్ మంగ్లీ మెడకు మరో వివాదం చుట్టుకుంటోంది. ఫామ్ హౌసులో డ్రగ్స్ పార్టీ, అధిక వడ్డీ పేరుతో చేసిన ఘరానా మోసాల వంటి కేసుల విషయాల్లో వార్తల్లో నిలిచినా ఈ జానపద గాయని మంగ్లీపై సోషల్ మీడియాలో మరో ఇష్యూ లేవదీశారు నెటిజన్స్. అయితే కొద్దికాలం క్రితం ఓ కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాటంలో రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపిన మా భూమి సినిమాలని "బండెనుక బండి గట్టి.. పదహారు బండ్లు గట్టి" అనే పాట పాడారు. అయితే అప్పట్లో నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా గూడ అంజయ్య రాసిన ఈ పాట ప్రజల నాల్కలపై నానింది. ఈ పాట వెనకాల ఉన్న పెయిన్, ఎమోషన్ అర్థం చేసుకోకుండా పార్టీల్లో, పబ్బుల్లో పాడినట్టు, డ్యాన్స్ చేస్తూ మంగ్లీ ఈ పాట పాడటంపై మరోసారి విరుచుకు పడుతున్నారు నెటిజన్స్. ఆ గంతులు ఏంటీ? ఆ పాడటం ఏంటని మండిపడుతున్నారు. ఈ కార్యక్రమం గతంలో జరిగినదే అయినప్పటికీ.. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మరోసారి తెర మీదికి వచ్చి రచ్చకు ఎక్కింది. తక్షణమే మంగ్లీ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.






