భారత కేంద్ర బడ్జెట్ 2026-27 పై సింగపూర్ వ్యాపార వర్గాల హర్షం

by Malleboina Mahesh |

భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఉదయం పార్లమెంటులో 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

భారత కేంద్ర బడ్జెట్ 2026-27 పై సింగపూర్ వ్యాపార వర్గాల హర్షం
X

దిశ, వెబ్ డెస్క్: భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Singapore business community cheers India's Union Budget 2026-27) ఆదివారం ఉదయం పార్లమెంటులో 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార వేత్తలు, ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సింగపూర్‌లోని భారతీయ వ్యాపార సంఘం 2026-27 కేంద్ర బడ్జెట్‌ను సానుకూలంగా స్వాగతించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటలైజేషన్, ఇన్నోవేషన్, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక వృద్ధికి ఈ బడ్జెట్ నిదర్శనమని సింగపూర్ భారతీయ వ్యాపార సంస్థల ప్రతినిధి గుర్దీప్ సింగ్ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ భారతదేశపు స్థిరమైన వృద్ధి పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సింగపూర్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (SICCI) ఈ బడ్జెట్‌ను విశ్లేషిస్తూ, ముఖ్యంగా తయారీ రంగం, MSMEలు, గ్రీన్ ఎనర్జీ, సాంకేతికతపై భారత్ పెట్టిన దృష్టిని అభినందించింది. సింగపూర్ ఆధారిత వ్యాపారాలకు, అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులకు ఈ బడ్జెట్ కొత్త అవకాశాలను కల్పిస్తుందని పేర్కొంది. ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన సహకారం ఉన్న రంగాలను బలోపేతం చేసేలా ఈ ప్రతిపాదనలు ఉన్నాయని SICCI స్పష్టం చేసింది.

Next Story