సిల్వర్ ప్రియులకు గుడ్ న్యూస్.. రెండో రోజు భారీగా పడిపోయిన వెండి ధరలు

by Malleboina Mahesh |

హైదరాబాద్‌లో వెండి, బంగారం ధరలు భారీగా తగ్గాయి. కేజీ వెండి రూ.15,000 పతనమవ్వగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,850కు చేరింది.

సిల్వర్ ప్రియులకు గుడ్ న్యూస్.. రెండో రోజు భారీగా పడిపోయిన వెండి ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచిన తర్వాత.. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. కానీ ఎవరూ ఊహించిన విధంగా గత రెండు రోజులుగా వెండి ధరలు పడిపోతున్నాయి. శనివారం ఉదయం. బులియన్‌ మార్కెట్‌లో ధరలు కుప్పకూలాయి. దీంతో హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.15 వేలు పతనం అయింది. దీంతో కేజీ వెండి ధర రూ. 2,90,000కు చేరింది. గడిచిన రెండు రోజుల్లోనే వెండి ధర మొత్తం రూ. 25,000 మేర తగ్గడం విశేషం. అలాగే వెండి బాటలోనే బంగారం ధరలు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల (మేలిమి బంగారం) 10 గ్రాముల ధర రూ. 980 మేర తగ్గి రూ. 1,56,930 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 900 తగ్గి రూ. 1,43,850 పలుకుతోంది.

Next Story