ఓవైపు ప్రభాస్.. మరోవైపు చిరు-బాలయ్య.. నలిగిపోతున్న Shruti Haasan

by Dishanational1 |
ఓవైపు ప్రభాస్.. మరోవైపు చిరు-బాలయ్య.. నలిగిపోతున్న Shruti Haasan
X

దిశ, సినిమా : ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ అందరూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ లిస్ట్‌లో శ్రుతి హాసన్ కూడా ఉండగా.. 'సలార్' మూవీలో మొదటిసారిగా ప్రభాస్‌తో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్న శ్రుతి.. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్‌ తన గత చిత్రాల్లో కథానాయికలను చూపించిన తీరుపై స్పష్టత ఉన్నందున 'సలార్‌'లో తన పని సులభమైందని పేర్కొంది. ఏదేమైనప్పటికీ ఆమె ఒకే సమయంలో హైదరాబాద్‌లోనే మరో రెండు చిత్రాల షూటింగ్స్‌కు హాజరు కావాల్సి ఉంది. ఇందులో ఒకటి గోపీచంద్ మలినేని - బాలకృష్ణ కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న సినిమా కాగా.. మెగాస్టార్‌ చిరుతో బాబీ డైరెక్ట్ చేస్తున్న 'వాల్తేరు వీరయ్య' మరొకటి. ఇదిలా ఉంటే.. అటు ప్రభాస్ సినిమాతో పాటు ఇటు సీనియర్ హీరోలతో కమిటైన ఈ రెండు చిత్రాల షెడ్యూల్స్‌తో మానసికంగా కుంగిపోతున్నట్లుగా వెల్లడించింది శ్రుతి.

Next Story

Most Viewed