workout: జిమ్‌లో వర్కవుట్ తర్వాత స్నానం చేస్తున్నారా? ముందుగా ఇది తెలుసుకోండి..

by Sujitha Rachapalli |

జిమ్‌లో వర్కవుట్‌తో చెమటలు పట్టిన తర్వాత మీరు చేసే మొదటి పని ఏంటి? కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకుంటారా? నీరు తాగుతారా? స్నానానికి వెళ్తారా? వీటిలో స్నానం మీ ఫస్ట్ ఆప్షన్ అయితే టెంపరేచర్ మెయింటెనెన్స్ ముఖ్యమని నిపుణుల సలహా.

workout: జిమ్‌లో వర్కవుట్ తర్వాత స్నానం చేస్తున్నారా? ముందుగా ఇది తెలుసుకోండి..
X

దిశ, ఫీచర్స్ : జిమ్‌లో వర్కవుట్‌తో చెమటలు పట్టిన తర్వాత మీరు చేసే మొదటి పని ఏంటి? కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకుంటారా? నీరు తాగుతారా? స్నానానికి వెళ్తారా? వీటిలో స్నానం మీ ఫస్ట్ ఆప్షన్ అయితే టెంపరేచర్ మెయింటెనెన్స్ ముఖ్యమని నిపుణుల సలహా. నిజానికి వేడి లేదా చల్లటి నీటితో స్నానం.. రెండు విధాలుగా రిఫ్రెష్ అవుతారు. చెమట, ధూళి శుభ్రం అవుతుంది. కానీ ఈ రెండింటిలో ఒక పద్ధతిని ఎంచుకోవడం కోలుకోవడంలో తేడాను కలిగిస్తుంది. ఇంతకీ ఏది బెస్ట్ ఆప్షన్ అనేది ఇప్పుడు చూద్దాం.

చల్లటి నీటి స్నానం

1. కండరాల వాపును తగ్గిస్తుంది

చల్లని నీటి స్నానం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి కండరాల వాపును తగ్గించడం. రక్త నాళాలను కుదించడం ద్వారా ఇలా జరుగుతుంది. ఇది కండరాలు, కణజాలాలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. తీవ్రమైన వ్యాయామం వల్ల కలిగే వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

2. నొప్పిని తగ్గిస్తుంది

చల్లని నీరు కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇంటెన్సివ్ వర్కవుట్ తర్వాత వెంటనే చల్లటి నీటితో స్నానం చేస్తే.. కండరాల నొప్పి తగ్గుతుంది. కోలుకోవడం వేగవంతం చేస్తుంది.

3. మానసిక దృఢత్వాన్ని మెరుగుపరుస్తుంది

చల్లటి నీటితో స్నానం మానసికంగా దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. వ్యాయామం తర్వాత ఇలా చేస్తే అసౌకర్యాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. శారీరక, మానసిక సవాళ్లను ఎదుర్కోవడానికి మానసికంగా దృఢంగా చేస్తుంది.

4. ఎండార్ఫిన్‌లను పెంచుతుంది

చెమట పట్టిన తర్వాత చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే షాక్ ఎండార్ఫిన్‌లను విడుదల చేయడానికి సహాయపడుతుంది, ఇవి శరీరానికి మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లు. మీరు మంచి మానసిక స్థితిలో ఉండటానికి, వ్యాయామం తర్వాత కలిగే అలసట, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతాయి.

5. బరువు తగ్గడానికి సహాయపడుతుంది

కోల్డ్ షవర్స్ బరువు తగ్గడానికి సహాయపడుతాయి. నీరు చల్లగా ఉంటే, శరీరం దాని ఉష్ణోగ్రతను నియంత్రించాల్సి ఉంటుంది. ఇందుకు శక్తి ఖర్చు అవుతుంది, ఇది కేలరీలను బర్న్ చేయడంలో మీకు సహాయపడుతుంది. అయితే బరువు తగ్గడానికి చల్లని నీటితో స్నానం చేయడంపై మాత్రమే ఆధారపడకూడదు. బరువు తగ్గడానికి వ్యాయామం కొనసాగించడం, ఆరోగ్యంగా తినడం, నాణ్యమైన నిద్ర ముఖ్యం.

వేడి నీటి స్నానం

1. కండరాల ఉద్రిక్తతను తగ్గిస్తుంది

వ్యాయామం తర్వాత వేడి నీటి స్నానం రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది కండరాలను సడలించడానికి, బిగుతును విడుదల చేయడానికి సహాయపడుతుంది. . కండరాలు కొద్దిగా గట్టిగా, నొప్పిగా మారే వర్కవుట్ సెషన్ తర్వాత ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది.

2. ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది

వ్యాయామం తర్వాత వేడి స్నానం కండరాలు, స్నాయువులను లూజ్ చేయగలదు. ఇది ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది. కదలడాన్ని సులభతరం చేస్తుంది. తీవ్రమైన శారీరక శ్రమ తర్వాత గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3. విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది

వ్యాయామం తర్వాత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. వేడి నీటి స్నానం మీ శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడంలో పాల్గొనే నరాల నెట్‌వర్క్ అయిన పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. దీనివల్ల మీరు రిలాక్స్‌గా ఉంటారు. భారీ వ్యాయామం తర్వాత ఒత్తిడిని తగ్గిస్తారు.

Next Story