- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోఠి SBI కార్యాలయం వద్ద కాల్పులు.. డీసీపీ శిల్పవల్లి కీలక ప్రకటన
కోఠి (Koti) ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఇవాళ ఉదయం జరిగిన కాల్పులు నగర ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి.

దిశ, వెబ్‌డెస్క్/కార్వాన్: కోఠి (Koti) ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఇవాళ ఉదయం జరిగిన కాల్పులు నగర ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. స్కూటర్‌పై వచ్చిన దుండగులు, రిషద్ (Rishad) అనే వస్త్ర వ్యాపారి ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేస్తుండగా ఉదయం 6.50 నంచి 7 గంటల ప్రాంతంలో అతడిపై కాల్పులు జరిపి ఏకంగా రూ. 6 లక్షల నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే పోలీసులు రిషద్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ టీమ్ (Forensic Team) ఆధారాలను సేకరించింది. అనంతరం స్పాట్‌ను ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లితో కలిసి అడిషనల్ సీపీ శ్రీనివాస్ (Additional CP Srinivas) పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ శిల్పవల్లి (DCP Shilpavalli) మాట్లాడుతూ.. రిషద్‌పై ఇద్దరు నిందితులు కాల్పులు జరిపినట్లుగా గుర్తించామని తెలిపారు. స్పాట్‌లో రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితులు స్కూటర్‌పై వచ్చి కాల్పులు జరిపారని, అనంతరం వారు నగదుతో చాదర్‌ఘాట్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని చెప్పారు. నిందితులు నగరం దాటి వెళ్లకముందే పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దింపామని డీసీపీ శిల్పవల్లి ప్రకటించారు.






