- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ రిజల్ట్స్.. సీఎం స్టాలిన్ సహా 28 మంది మంత్రులు వెనుకంజ
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకేకు భారీ షాక్ తగిలింది. సీఎం స్టాలిన్ మరియు 28 మంది మంత్రులు వెనుకంజలో ఉండటంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ నేతలు దారుణంగా ఓడిపోతున్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం ఎవరూ ఊహించని విధంగా టీఎంకే 100కు పైగా స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుండగా, ఏఐడీఎంకే 72 స్థానాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అలాగే అధికార డీఎంకే కేవలం 51 స్థానాలకు పరిమితం అయ్యి.. మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల ఫలితాల్లో కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తొలి రౌండ్ల లెక్కింపులో వెనకంజలో ఉండటం రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
కేవలం ముఖ్యమంత్రే కాకుండా, రాష్ట్ర మంత్రివర్గంలోని సుమారు 28 మంది మంత్రులు తమ నియోజకవర్గాల్లో వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెపాకం నియోజకవర్గంలో వెనుకబడి ఉండగా, ఇప్పుడు సీఎం మరియు ఇతర మంత్రులు కూడా అదే బాటలో ఉండటంతో డీఎంకే శ్రేణులు ఆందోళనలో మునిగిపోయాయి. అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో టీవీకే (TVK), ఏఐడీఎంకే (AIADMK) అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఎర్లీ ట్రెండ్స్ గమనిస్తుంటే తమిళనాడులో పదేళ్ల తర్వాత అధికార మార్పిడి, హంగ్ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.






