నడిరోడ్డుపై అర్ధనగ్నంగా కానిస్టేబుల్ వీరంగం.. భార్యాబిడ్డలపై అత్యంత క్రూరంగా..

by Gantepaka Srikanth |

మంచిర్యాల జిల్లా కేంద్రంలో షాకింగ్ ఘటన వెలుగుజూసింది.

నడిరోడ్డుపై అర్ధనగ్నంగా కానిస్టేబుల్ వీరంగం.. భార్యాబిడ్డలపై అత్యంత క్రూరంగా..
X

దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల(Mancherial) జిల్లా కేంద్రంలో షాకింగ్ ఘటన వెలుగుజూసింది. మద్యం మత్తులో పోలీస్ కానిస్టేబుల్ రవిప్రసాద్(Police Constable Ravi Prasad) వీరంగం సృష్టించాడు. అర్ధనగ్నంగా ఇంటి ఎదుట నానా హంగామా చేశాడు. నడిరోడ్డుపై భార్యా, బిడ్డలను అత్యంత కిరాతకంగా చితకబాదాడు. భార్య కూడా పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి వద్దకు వెళ్లి విచారణ చేయగా, భార్య, మూడేళ్ల కూతురిని ఇంటి నుంచి వెళ్లగొట్టినట్లు తెలిసింది. కాళ్లు, చేతులు పట్టుకున్నా కనికరించకుండా ఇంటినుంచి గెంటేశాడని స్థానికులు చెబుతున్నారు. ఆ ఘటనను స్థానికులు సెల్‌ ఫోన్‌లో రికార్డ్ చేసి పోలీసులకు అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story