కాపీరైట్ పోరులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. 134 సినిమాల సంగీతంపై ఢిల్లీ హైకోర్టు ఆంక్షలు

by Malleboina Mahesh |

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సరిగమ మ్యూజిక్ సంస్థతో వివాదంలో 134 సినిమాల సంగీతంపై ఆంక్షలు విధించింది.

కాపీరైట్ పోరులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. 134 సినిమాల సంగీతంపై ఢిల్లీ హైకోర్టు ఆంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. కాపీరైట్ కేసులో 134 సినిమాల సంగీతంపై కోర్టు ఆంక్షలు విధించింది. తన సంగీతానికి సంబంధించి రాయల్టీ, పేటెంట్ హక్కుల కోసం నిర్మాతలు, మ్యూజిక్ కంపెనీలపై న్యాయపోరాటం చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన కంపోజ్ చేసిన దాదాపు 134 సినిమాల సౌండ్ రికార్డింగ్స్, మ్యూజిక్ వాడకంపై న్యాయస్థానం తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. సరిగమ (Saregama) మ్యూజిక్ సంస్థ వద్ద ఆయా సినిమాల సంగీత హక్కులు ఉన్నాయని, ఇళయరాజా వాటిని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేయడంపై సదరు సంస్థ కోర్టును ఆశ్రయించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.

నిజానికి గత కొంతకాలంగా తమిళ చిత్రాల కాపీరైట్ హక్కుల విషయంలో ఇళయరాజా, నిర్మాణ సంస్థల మధ్య తీవ్రస్థాయిలో పోరు నడుస్తోంది. తాను సృష్టించిన సంగీతంపై పూర్తి హక్కులు తనకే ఉంటాయని ఆయన వాదిస్తుండగా, తాము పెట్టుబడి పెట్టినందున ఆ హక్కులు తమకే దక్కుతాయని నిర్మాతలు వాదిస్తున్నారు. ఇప్పుడు తాజాగా సరిగమ సంస్థకు అనుకూలంగా కోర్టు ఆదేశాలు రావడంతో, డిజిటల్ మాధ్యమాల్లో ఆయన పాత సూపర్ హిట్ సాంగ్స్ వాడకంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఒక తమిళ పాట కాపీరైట్ విషయంలో వీరి మధ్య వివాదం కొనసాగుతుండగానే, తాజా తీర్పు ఇళయరాజాకు పెద్ద షాక్‌గానే పరిగణించవచ్చు.

Next Story