మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

by Kema Shiva Kumar |

వైసీపీ ముఖ్య నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఊహించిన షాక్ తగిలింది.

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ముఖ్య నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Gorantla Madhav)కు ఊహించిన షాక్ తగిలింది. అత్యాచార బాధితురాలి వివరాలను వెల్లడించినట్లు నమోదైన కేసులో ఆయనపై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-Bailable Warrant) జారీ చేస్తూ విజయవాడలోని పోక్సో (POCSO) కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన ఒక అత్యాచార ఘటనకు సంబంధించి, బాధితురాలైన మైనర్ బాలిక గుర్తింపును మరియు వ్యక్తిగత వివరాలను గోరంట్ల మాధవ్ బహిరంగంగా వెల్లడించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma)ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా గోరంట్ల మాధవ్‌ను పలుమార్లు కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించగా.. వరుసగా విచారణకు గైర్హాజరు కావడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో ఆయనపై విజయవాడ పోక్సో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

Next Story