పెళ్లి తరవాత ఆ పని చేయలేదు.. షాకింగ్ విషయం చెప్పిన శోభిత

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-12 10:04:56  IST  )

పెళ్లి తరవాత ఒక్కసారి కూడా వంట చేయలేదని హీరోయిన్ శోభిత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. హోటల్స్ లో ఆర్డర్ పెట్టుకుంటానని తెలిపింది.

పెళ్లి తరవాత ఆ పని చేయలేదు.. షాకింగ్ విషయం చెప్పిన శోభిత
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ(Shobhita Dhulipala) అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక 2024లో అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరు ఒక్కటయ్యారు. అయితే పెళ్లి తర్వాత నాగచైతన్య వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ శోభిత మాత్రం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. మళ్లీ రెండేళ్ల తర్వాత ‘చీకటిలో’ అనే ఓటీటీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. లేడీ ఓరియెంటెడ్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈక్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న శోభిత షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంట్లో మీ అత్తవాళ్లకి వంట చేస్తవా అని యాంకర్ ప్రశ్నించగా.. నవ్వేసిన శోభిత.. ‘‘నాగచైతన్యతో పెళ్లైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వంట ప్రయోగాలు చేయలేదు.

కానీ ఎప్పుడూ ఫోన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాను. చైతన్య షోయూ రెస్టారెంట్ నుంచే కాకుండా.. వేరే హోటల్స్ నుంచి కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటాను. రోజూ కచ్చితంగా ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుని తింటాను. మా డైరెక్టర్‌కు కూడా ఫోన్ చేసి హైదరబాద్‌లో మంచి పునుగులు, సమోసాలు, మిరపకాయ బజ్జీ, టిఫిన్స్ ఎక్కడ దొరుకుతుతాయని అడుగుతాను. టెస్టీ ఫుడ్ ఎక్కడ ఉంటే.. అక్కడికి వెళ్లి తింటుంటాను. పునుగులు, సమోసాలు నేను గట్టిగా తింటాను. ఎంత తిన్నా కానీ వర్కౌట్స్ మాత్రం చేస్తాను. సాధారణంగా సెలబ్రిటీలు ఎవరికి ఏది నచ్చితే అది చేస్తుంటారు. అలా నేను వర్కౌట్స్ చేస్తాను’’అని చెప్పింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరికొందరు షాక్ అవుతున్నారు. రోజు ఆర్డర్ పెట్టాలంటే బాగానే ఖర్చు చేస్తుందని అంటున్నారు.

Next Story