- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shloka Mehta: అంబానీ కోడలు ధరించిన ఈ సింపుల్ జీన్స్ టాప్ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
అంబానీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

అంబానీ కోడలు ధరించిన ఈ సింపుల్ జీన్స్ టాప్ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
దిశ, వెబ్‌డెస్క్: ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వీరి గురించి ఏ చిన్న వార్త అయినా సోషల్ మీడియాలో హైలెట్ అవుతూ ఉంటుంది. పెళ్లై ఏడాది దగ్గరకు వస్తోన్న అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) అండ్ రాధిక మర్చంట్ (Radhika Merchant) పెళ్లి ఫొటోలు మొన్నటివరకు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. వీరి మ్యారేజ్ చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా జరిగింది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అనంత్ అంబానీ వివాహానికి హాజరై సందడి చేశారు. ఖరీదైన బహుమతులు కూడా సమర్పించారు.
ఇకపోతే ముఖేష్ అంబానీ ఫ్యామిలీ గురించి తరచూ నెట్టింట ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. అంబానీ సతీమణి, కోడళ్లు ధరించిన దుస్తులు, ఏదైనా క్యాస్టూమ్స్ అయినా హైలెట్ అవుతుంటాయి. అయితే ముఖేష్ అంబానీ పెద్ద కోడలు శ్లోక మెహతా అంబానీ(Shloka Mehta Ambani) రణ్‌ధీర్ కపూర్(Randhir Kapoor) 78 వ బర్త్ డే వేడుకల్లో తన పిల్లలతో కలిసి హాజరైంది. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో శ్లోక మెహతా వేసుకున్న సింపుల్ టాప్ ప్రజెంట్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. క్లాసిక్ టాప్, డెనిమ్ కాంబినేషన్ లో స్టైలిష్‌గా ఉంది.
ఈ స్టైలిష్ అందరిని ఆకట్టుకోవడంతో సింపుల్ టాప్ ధరెంత అని జనాలు సెర్చ్ చేయడం ప్రారంభించారు. శ్లోక మెహత వేసుకున్న ఈ సింపుల్ టాప్ ధర అక్షరాల 22 వేల రూపాయలు అట. అలాగే తను ధరించిన జీన్స్ ధర ముప్పై తొమ్మిది వేలు అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక అంబానీ పెద్ద కోడలు వేసుకున్న టాప్ కాటన్ ఫాబ్రిక్(Cotton fabric)తో రెడీ చేశారు. గుండ్రని నెక్ లైన్, ఫ్లటర్ స్లీవ్స్(Flutter sleeves), ఫ్రంట్ బటన్ ప్లాకెట్(Front button placket), ముందు భాగంలో పిన్-టకింగ్ (Pin-tucking)కలిగి మంచి లుక్ తో కనిపిస్తుంది. దీనికి తోడుగా డెనిమ్ జీన్స్ కూడా వేసుకోవడంతో ఆకర్షణీయంగా కనిపించింది.






