- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హార్మూజ్ మూసివేత.. వెనుదిరిగిన నౌకలు
ఇజ్రాయెల్ లెబనాన్‌పై జరిపిన భీకర దాడులకు ప్రతీకారంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మరోసారి మూసివేసింది.

Strait of Hormuz
దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 14 రోజుల కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ లెబనాన్‌పై జరిపిన భీకర దాడులు పరిస్థితిని తలకిందులు చేశాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో నౌకల రాకపోకలను బలవంతంగా అడ్డుకుంటోంది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ మార్గంలో యుద్ధ నౌకలు, చమురు ట్యాంకర్లు మరోసారి వెనక్కి మళ్లుతుండటం ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
గ్రౌండ్ రిపోర్ట్స్...
మారిటైమ్ ట్రాకింగ్ డేటా ప్రకార.. కాల్పుల విరమణ కుదిరిన తొలి గంటల్లో గ్రీకుకు చెందిన 'NJ Earth', లైబీరియా జెండా కలిగిన 'Daytona Beach' వంటి నౌకలు జలసంధిని దాటగలిగాయి. అయితే, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ మరోసారి జలసంధిని మూసివేయగా.. 'AUROURA' అనే భారీ చమురు నౌక జలసంధిని దాటేందుకు ప్రయత్నించగా, ఇరాన్ నావికాదళం దానిని అడ్డుకుంది. దీంతో ముసందమ్ తీరం సమీపంలో ఆ నౌక బలవంతంగా వెనుదిరగాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితే మరికొన్ని అంతర్జాతీయ నౌకలకు కూడా ఎదురైనట్లు సమాచారం. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదని, ఇరాన్ క్షేత్రస్థాయిలో దిగ్బంధనాన్ని అమలు చేస్తోందని దీనిని బట్టి అర్థమవుతోంది.
నిలిచిపోయిన వెయ్యి నౌకలు
తాజా సమాచారం ప్రకారం.. మంగళవారం నాటికి సరకుతో నిండిన 187 భారీ చమురు ట్యాంకర్లు సహా మొత్తం 1,000కి పైగా నౌకలు జలసంధి దాటలేక సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి. ఒకవేళ ఇప్పుడే పరిస్థితులు చక్కబడి, ఇరాన్ జలసంధిని తెరిచినప్పటికీ.. అక్కడ పేరుకుపోయిన ట్రాఫిక్ క్లియర్ కావడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ జాప్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతో పాటు Supply Chain దెబ్బతినే ప్రమాదం ఉంది.






