తెలంగాణలో భానుడి ఉగ్రరూపం.. ఉత్తర, దక్షిణ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’

by Malleboina Mahesh |

తెలంగాణలో ఎండలు ముదిరాయి. మే 26 వరకు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రాచలంలో అత్యధికంగా 45.6°C ఉష్ణోగ్రత నమోదైంది.

తెలంగాణలో భానుడి ఉగ్రరూపం.. ఉత్తర, దక్షిణ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’
X

దిశ, వెబ్ డెస్క్: వాతావరణ శాఖ అంచనా వేసిన విధంగానే తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా కొనసాగుతోంది. గత వారం రోజులుగా 42 °C ఉష్ణోగ్రత నుంచి 45 °C ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు తీవ్రమైన వేడి గాలులు వీస్తుండటంతో సామాన్య ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా నమోదైన ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 26 వరకు ఉత్తర, దక్షిణ తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్ (Red alert) జారీ చేసింది. తాజా అలర్ట్ ప్రకారం.. భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా హీట్‌వేవ్ కొనసాగనుంది.

నిన్న, ఈ రోజు భద్రాచలంలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఖమ్మం‌లో 45.4°C, హనుమకొండలో 44.0°C ఉష్ణోగ్రత రామగుండంలో 44.1°C, ఆదిలాబాద్‌లో 43.8°C ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 43.5°C, మెదక్‌లో 42.8 డిగ్రీలు నల్గొండలో 42.5°C, హైదరాబాద్‌లో 42.4°C నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు నుంచి రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.

Next Story