- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉగ్రవాదుల పై విరుచుకుపడ్డ CTD.. రెండు ఆపరేషన్లలో ఏడుగురు ముష్కరులు హతం
దేశంలోని ఉగ్రవాదులను నిర్మూలించేందుకు పాక్ ఏర్పాటు చేసిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ మెరుపు దాడులతో విరుచుకుపడింది.

దిశ, వెబ్ డెస్క్: దేశంలోని ఉగ్రవాదులను నిర్మూలించేందుకు పాక్ ఏర్పాటు చేసిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (Counter Terrorism Department) మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈరోజు నాడు ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో CTD జరిపిన మెరుపు దాడి లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. వీరు గతంలో పోలీసులు, భద్రతా బలగాలపై జరిగిన దాడుల్లో నేరుగా పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి వద్ద నుంచి మూడు కలాష్నికోవ్ రైఫిళ్లు, రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని కలాట్ జిల్లాలో భద్రతా దళాలు నిర్వహించిన మరో ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల ఉనికిపై అందిన నిఖార్సైన సమాచారంతో సైన్యం ఈ గాలింపు చర్యలు చేపట్టింది. ఎదురు కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి ఆయుధాలను రికవరీ చేశారు. పాకిస్థాన్‌లో పెరుగుతున్న ఉగ్రదాడుల నేపథ్యంలో భద్రతా దళాలు తమ నిఘా ఆపరేషన్లను మరింత ఉధృతం చేశాయి.






