దేవభూమిలో సంచలన నిర్ణయం.. గంగోత్రి ధామ్‌లోకి హిందూయేతరులకు ప్రవేశం నిషిద్ధం

by Malleboina Mahesh |

దేవభూమిగా పేరుగాంచిన సుప్రసిద్ధ గంగోత్రి ధామ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

దేవభూమిలో సంచలన నిర్ణయం.. గంగోత్రి ధామ్‌లోకి హిందూయేతరులకు ప్రవేశం నిషిద్ధం
X

దిశ, వెబ్ డెస్క్: దేవభూమిగా పేరుగాంచిన సుప్రసిద్ధ గంగోత్రి ధామ్‌ (Gangotri Dham) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆదివారం జరిగిన శ్రీ గంగోత్రి ఆలయ కమిటీ సుప్రసిద్ధ గంగోత్రి ధామ్‌లో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఆదివారం జరిగిన కమిటీ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ నిబంధన కేవలం గంగోత్రి ధామ్‌కే పరిమితం కాకుండా, గంగామాత శీతాకాల నివాసమైన 'ముఖబా'కు కూడా వర్తిస్తుందని కమిటీ చైర్మన్ సురేష్ సెమ్వాల్ స్పష్టం చేశారు. ఆలయ పవిత్రతను, సంప్రదాయాలను కాపాడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆయన వెల్లడించారు.

ఇదే మార్గంలో బద్రీనాథ్–కేదార్‌నాథ్

గంగోత్రి ఆలయ కమిటీ బాటలో మరిన్ని ఆలయాలు పయనించే అవకాశం కనిపిస్తోంది. శ్రీ బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది మాట్లాడుతూ.. తమ కమిటీ పరిధిలోకి వచ్చే బద్రీనాథ్, కేదార్‌నాథ్ సహా అన్ని ఉపాలయాల్లోనూ హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించే ప్రతిపాదనను రాబోయే బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే హరిద్వార్‌లోని హర్ కీ పౌరీ ఘాట్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి ఆంక్షలు అమలులో ఉండగా, ఇప్పుడు చార్ ధామ్ యాత్రలోని ప్రధాన క్షేత్రాలకు కూడా ఈ నిబంధనలు విస్తరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story