- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కానుకల సేకరణ విషయంలో శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ సంచలన నిర్ణయం
బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయాల్లో కానుకలు, విరాళాల లెక్కింపులో సంపూర్ణ పారదర్శకత.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలని సీఈఓ సోహన్ సింగ్ హెచ్చరిక!

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చార్ ధామ్ యాత్రలో ప్రారంభం అయింది. ఈ యాత్రలో అత్యంత కీలకమైన పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలకు వచ్చే భక్తుల కానుకలు, విరాళాల సేకరణ విషయంలో శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అవినీతికి తావులేకుండా BKTC కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఆలయ కమిటీ పరిధిలోకి వచ్చే అన్ని దేవాలయాలలో ఆదాయ వనరులు, విరాళాలు, భక్తులు సమర్పించే కానుకల లెక్కింపు ప్రక్రియలో సంపూర్ణ పారదర్శకతను పాటించాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఆర్థిక అవకతవకలు, భక్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ఉండేందుకు ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు బోర్డు తెలిపింది.
లెక్కింపు కేంద్రాలు, ట్రెజరీ విభాగాలపై ప్రత్యేక నిఘా
ఆలయ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సోహన్ సింగ్ రంగర్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్‌తో పాటు కమిటీ ఆధ్వర్యంలో నడిచే అన్ని ఆలయాలలోని కానుకల లెక్కింపు కేంద్రాలు (Donation Counting Centres), అకౌంట్స్ బ్రాంచ్‌లు, ట్రెజరీ విభాగాలు, గెస్ట్ హౌస్‌లు, పూజా కౌంటర్లలో పనిచేసే అధికారులు, ఉద్యోగులందరూ అత్యంత అప్రమత్తంగా (Heightened Vigilance) వ్యవహరించాలని సీఈఓ ఆదేశించారు. భక్తులు సమర్పించే నగదు, బంగారం, వెండి ఇతర విలువైన వస్తువుల లెక్కింపు, భద్రపరచడం లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా, చిన్నపాటి అవకతవకలకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే సిబ్బందిపై తక్షణమే కఠినమైన క్రమశిక్షణా చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఆలయాల ఆదాయ నిర్వహణ మరింత పారదర్శకంగా మారుతుందని భక్తులు హర్షిస్తున్నారు.






