- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజం చెబితే.. మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటాం: MP అర్వింద్ సంచలన సవాల్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను పదేళ్ల పాటు బీఆర్ఎస్ నేతలు మింగితే.. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మింగేస్తున్నారని ఆరోపించారు. ఇద్దరూ తోడు దొంగలు అని అన్నారు. అందుకే కేసీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నారని విమర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో చెబితే.. తాము జగిత్యాల మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని సంచలన సవాల్ చేశారు. మరోవైపు.. ఇవాళ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. శనివారం అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు ఉంది. రాష్ట్రంలో మొత్తం 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరుగనుంది.






