- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండెపోటుతో బీజేపీ సీనియర్ నేత మృతి
by Ratna Kumari |
లింగంపేట మండల కేంద్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మహారాజుల మురళి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

X
దిశ, లింగంపేట : లింగంపేట మండల కేంద్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మహారాజుల మురళి (59) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మహారాజుల మురళి భారతీయ జనతా పార్టీలో క్రియాశీల సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా సేవలందించారు. అలాగే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా, కరసేవకుడిగా కూడా పనిచేశారు. మురళి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతితో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Next Story






