మెట్రో పిల్లర్‌పై 'సేవ్ హోర్డింగ్'.. లక్ష మంది నోళ్లు కొట్టొద్దంటూ సీఎం రేవంత్‌కు TOMO మొర

by Malleboina Mahesh |

మెట్రో పిల్లర్‌పై సీఎం రేవంత్ రెడ్డికి TOMO వినూత్న హోర్డింగ్. జీవో 84 రద్దు చేసి, లక్షమంది జీవనోపాధి కాపాడాలని విజ్ఞప్తి.

మెట్రో పిల్లర్‌పై సేవ్ హోర్డింగ్.. లక్ష మంది నోళ్లు కొట్టొద్దంటూ సీఎం రేవంత్‌కు TOMO మొర
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ, హైదరాబాద్ నగరంలోని మెట్రో పిల్లర్లు వినూత్న నిరసనకు వేదికయ్యాయి. తమ జీవనోపాధిని కాపాడాలంటూ తెలంగాణ ఔట్ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (TOMO) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 'హోర్డింగ్స్' ద్వారానే 'విజ్ఞప్తి' చేసింది. మెట్రో పిల్లర్లపై వెలిసిన ఈ హోర్డింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు, మరో చిన్న హోర్డింగ్ పై "సీఎం గారు సేవ్ హోర్డింగ్" అని ఉన్న ఫోటోను ముద్రించారు. "సీఎం గారు సేవ్ హోర్డింగ్స్.. సేవ్ 1 లాక్ పీపుల్.. అబాలిష్ జీవో ఎం/ఎస్ నెం. 84" (G.O. Ms No. 84) అంటూ తమ గోడును విన్నవించుకున్నారు.

నగరంలో భారీ హోర్డింగ్స్‌పై నియంత్రణలు విధిస్తున్న జీవో 84 తమ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తుందని, దీనివల్ల లక్ష మందికి పైగా జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని TOMO ఆవేదన వ్యక్తం చేసింది. అసెంబ్లీలో రాష్ట్ర సమస్యలపై చర్చ జరుగుతున్న తరుణంలో, ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు తమ సమస్యకు కారణమైన 'హోర్డింగ్' ద్వారానే సీఎంకు రిక్వెస్ట్ చేయడం గమనార్హం. గతంలో కాంగ్రెస్ పార్టీ 'చీప్ ఫార్ములా' అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై నిరసన తెలపగా, ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు అదే ఔట్ డోర్ మీడియా ఓనర్స్ తమ మనుగడ కోసం ఈ వినూత్న పద్ధతిని ఎంచుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.

Next Story