- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్ధరాత్రి వరకు సంబురంగా సర్పంచ్.. తెల్లారేసరికి హఠన్మరణం
by Satheesh |
దిశ, భిక్కనూరు: భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామ సర్పంచ్ మాతూరి- latest Telugu news

X
దిశ, భిక్కనూరు: భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామ సర్పంచ్ మాతూరి గంగయ్య(43) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గంగయ్య గురువారం ఉదయం నుంచి గుండె నొప్పితో బాధపడ్డాడు. దీంతో ఆస్పత్రికి వెళ్లి చెకప్ చేయించుకోవాలని పలువురు సూచించగా.. పనిలో బిజీగా ఉండి వెళ్లలేకపోయాడు. సాయంత్రం గ్రామంలో జరిగిన కాముని దహనం కార్యక్రమంలో గ్రామస్థులతో కలిసి అర్ధరాత్రి 12 వరకు ఉన్నాడు. ఇంటికి వెళ్లి పడుకున్న కొద్దిసేపటికే మరోసారి గుండెపోటు రావడంతో.. అర్ధరాత్రి కుటుంబ సభ్యులు కామారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు.
Next Story






