సరండ ఎన్‌కౌంటర్‌.. 15‌కు చేరిన మావోయిస్టుల మృతుల సంఖ్య

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-22 09:53:51  IST  )

జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని కిరిబురు, ఛోటానాగ్ర పోలీస్ స్టేషన్ల పరిధిలోని సారండ (Saranda) అటవీ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

సరండ ఎన్‌కౌంటర్‌.. 15‌కు చేరిన మావోయిస్టుల మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని కిరిబురు, ఛోటానాగ్ర పోలీస్ స్టేషన్ల పరిధిలోని సారండ (Saranda) అటవీ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. మృతుల్లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ కూడా ఉన్నట్లుగా నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయనపై ఏకంగా రూ.5 కోట్ల రివార్డు ఉందని భద్రతా బలగాలు వెల్లడించాయి.

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యంతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ (CRPF) కోబ్రా 209 బెటాలియన్ దళాలు సంయుక్తంగా ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

READ MORE .....

సరండ అటవీ ప్రాంతంలో భీకర ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

Next Story