సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్.. ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-08 12:47:48  IST  )

రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు సంక్రాంతి పండుగకు సెలవునలు ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది.

సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్.. ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు సంక్రాంతి (Sankranthi) పండుగకు సెలవునలు ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) కిక్కిరిసిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి భారీగా సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. ఇవాళ ఉదయం నుంచే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు భారీ ఎత్తున ప్రయాణికులు తరలివస్తున్నారు. అయితే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 150 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, తిరుపతి వంటి ప్రాంతాలకు డిమాండ్ విపరీతంగా ఉండటంతో అదనపు సర్వీసులు నడుపుతున్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో రద్దీని తగ్గించడానికి హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు జనవరి 7 నుంచి 20 వరకు తాత్కాలిక హాల్ట్‌లు కల్పించారు. ఐటీ ఉద్యోగులు సికింద్రాబాద్ రాకుండా నేరుగా హైటెక్ సిటీలోనే రైలు ఎక్కే వీలు కల్పించారు.

పార్కింగ్, ఎగ్జిట్ రూట్ల మార్పు..

మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నందున, ప్లాట్‌ఫామ్ నంబర్ 10 వైపు పార్కింగ్, ఎగ్జిట్ రూట్‌ను మార్చేశారు. అదేవిధంగా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రైల్వే శాఖ అదనపు సిబ్బందిని, పోలీసు బలగాలను మోహరించారు. ఇక అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు తీసుకునే ప్రయాణికులు ‘రైల్ వన్’ (Rail One) యాప్ యూజ్ చేసి 3 శాతం డిస్కౌంట్ పొందవచ్చని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

Next Story