- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sankranti: సంక్రాంతి మూడు రోజులు కాదు.. నాలుగు రోజులు.. ఏ రోజు ఏం చేస్తారో తెలుసా?
తెలుగు ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పండుగల్లో సంక్రాంతి ఫేస్టివల్ ఒకటి.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పండుగల్లో సంక్రాంతి ఫేస్టివల్ ఒకటి. ఈ పండుగను దక్షిణ భారతదేశంలో.. అలాగే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సంప్రద్రాయబద్ధంగా నిర్వహించుకుంటారు. అయితే చాలా మంది సంక్రాంతినిజజ భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల వేడుక అని భావిస్తారు. కానీ ఈ ఫేస్టివల్ నాలుగు రోజుల పాటు జరుపుకోవాలట. మరీ ఈ నాలుగు రోజుల్లో ఏంఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
భోగి పొంగల్ మొదటి రోజు ..
ఇవాళ ఉ(జనవరి 13) భోగి పొంగల్ ను జనాలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. నేటి రోజు ప్రాముఖ్యత చూసినట్లైతే.. వ్యవసాయ భూమిని సారవంతం చేసేందుకు కృతజ్జతగా ఇవాళ వర్షాధిపతి ఇంద్రుడిని పూజిస్తారు.
సూర్య పొంగల్.. రెండవ రోజు..
సూర్య పొంగల్ నాడు పాలను మరిగించి.. పొంగిస్తారు. దీంతోపాటుగా తీపి వంటకాలకు సంబంధించిన పాయసం చేసి ఇంటిల్లిపాదీ తింటారు. కొబ్బరి, అరటి, చెరకు వంటివి సూర్యభగవానుడికి సమర్పించి.. మనసులో మాటల్ని దేవుడికి చెప్పుకుంటారు.
ముట్టు పొంగల్.. మూడో రోజు..
ముట్టు పొంగల్ గోవుల ఆరాధనకు అంకితమైనది. వ్యవసాయదారులు మూడో రోజు ఎద్దులను, ఆవులను దేవుళ్లతో సమానంగా పూజిస్తారు. రైతులకు ఎంతగానో సహాయం చేసే వీటిని ముట్టు పొంగల్ నాడు స్నానం చేయించి.. అందంగా ముస్తాబు చేస్తారు. కొమ్ములకు రంగులు పూసి.. మెడలో పూలదండలు వేస్తారు.
కానుం పొంగల్.. నాలుగో రోజు..
నాలుగో రోజు కానుం పొంగల్ పండుగనే కనుమ అని పిలుస్తారు. ఈ రోజు సూర్య భగవానుడిని ఆరాధించి.. ఆయనకు ఇష్టమైనవి ప్రసాదిస్తారు. మాధుర్యానికి, ఆనందానికి ప్రతీకగా చెరకును దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. బంధువులతో కలిసి జాలిగా గడుపుతారు.






