ఆ డ్రెస్సింగ్‌లోనే స్త్రీ అందం బయటపడుతుంది.. యంగ్ బ్యూటీ

by Disha Web Desk 7 |
ఆ డ్రెస్సింగ్‌లోనే స్త్రీ అందం బయటపడుతుంది.. యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ సంయుక్తా మీనన్ అనుకోకుండా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యానంటోంది. అప్‌కమింగ్ ఫిల్మ్ 'బింబిసార' ప్రమోషన్స్‌లో పాల్గొన్న భామ.. 'అనుకోకుండా నటిగా చాన్స్ రావడంతో సినిమాల్లోకి అడుగుపెట్టాను. మలయాళంలో వచ్చిన గుర్తింపుతోనే తెలుగులో అవకాశాలు వచ్చాయి. 'బింబిసార' టైమ్‌ ట్రావెల్‌ మూవీ. ఫ్లాష్‌బ్యాక్, ప్రజెంట్‌ సిచ్యుయేషన్స్‌లో స్క్రీన్‌ ప్లే సాగుతుంది. ఇందులో నేను కాస్త మోడ్రన్‌ పాత్రలో కనిపిస్తాను. 'బింబిసార' తర్వాత సాయిధరమ్‌ తేజ్‌తో ఓ మూవీ చేస్తున్నా' అంటూ చెప్పొకొచ్చింది. ఈ క్రమంలోనే ఏ సినిమా చేసినా ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్రలు చేయాలన్న బ్యూటీ.. భాష తెలియకుండా నటిస్తే పాత్రతో సగం కనెక్షన్‌ మిస్‌ అవుతుందని అభిప్రాయపడింది. అందుకే తనకు వేరే వాళ్లు డబ్బింగ్‌ చెప్పడం ఇష్టంలేక లాక్‌డౌన్‌లో ట్యూటర్‌ని పెట్టుకుని తెలుగు నేర్చుకున్నట్లు చెప్పింది. చివరగా వస్త్రధారణ కాస్త నిండుగానే ఉంచుకోవడం ఇష్టమన్న నటి.. గ్లామర్‌ను డ్రెస్‌తో కనెక్ట్‌ చేసి చూడటం అనేది తప్పని చెప్పడం విశేషం. కాగా 'బింబిసార' ఆగస్టు 5న రిలీజ్‌ కానుంది.


Next Story

Most Viewed