Galaxy సిరీస్‌లో రెండు ఫోన్‌లను లాంచ్ చేసిన Samsung

by Disha Web Desk 17 |
Galaxy సిరీస్‌లో రెండు ఫోన్‌లను లాంచ్ చేసిన Samsung
X

దిశ,వెబ్‌డెస్క్: దక్షిణకొరియా దిగ్గజం Samsung రెండు ఫోన్‌లను ఇండియాలో లాంచ్ చేసింది. Galaxy A13, Galaxy A23 ఫోన్‌లు శుక్రవారం కంపెనీ నుంచి విడుదల అయ్యాయి. రెండు ఫోన్‌లు స్పెసిఫికేషన్స్ పరంగా ఒకే విధంగా ఉన్నాయి.

Samsung Galaxy A13 స్పెసిఫికేషన్స్

-6.6-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,408 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.

-Android 12-ఆధారిత One UI 4.1పై పనిచేస్తుంది.

-6GB RAMతో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ ద్వారా రన్ అవుతుంది.

-50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, రెండు 2MP కెమెరాలు ఉన్నాయి.

-8MP సెల్ఫీ కెమెరా ఉంది.

-మెమరీని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు పెంచవచ్చు.

-హ్యాండ్‌సెట్ 5,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ చార్జర్‌కు సపోర్ట్ ఇస్తోంది.

-4GB RAM + 64GB స్టోరేజ్ మోడల్‌ రూ. 14,999. 6GB RAM + 128GB ధర రూ. 17,999.

-స్మార్ట్‌ఫోన్ బ్లాక్, లైట్ బ్లూ, ఆరెంజ్, వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

Samsung Galaxy A23 స్పెసిఫికేషన్స్

-6.6-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,408 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.

-Android 12-ఆధారిత One UI 4.1పై పనిచేస్తుంది.

-8GB RAMతో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

- 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, రెండు 2MP కెమెరాలు ఉన్నాయి.

- 8MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది.

- మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 1TB వరకు పెంచవచ్చు.

-హ్యాండ్‌సెట్ 5,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ చార్జర్‌కు సపోర్ట్ ఇస్తోంది.

- 6GB RAM+ 128GB మోడల్‌ రూ.19,499. 8GB RAM+ 128GB వేరియంట్ ధర రూ. 20,999.

-ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, లైట్ బ్లూ, ఆరెంజ్, వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

Next Story

Most Viewed