- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనం నుంచి వనంలోకి ప్రవేశించిన సమ్మక్క-సారలమ్మలు
మూడు రోజుల క్రింద ప్రారంభమైన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర నేడు తల్లులు జనం నుంచి వనంలోకి ప్రవేశించడంతో ముగిసింది.

దిశ, గూడూరు: మూడు రోజుల క్రింద ప్రారంభమైన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర నేడు తల్లులు జనం నుంచి వనంలోకి ప్రవేశించడంతో ముగిసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చింతల గట్టు వట్టి వాగు వద్ద జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరలో సుమారు 6 లక్షల మంది భక్తులు జాతరకు హాజరు అయి ఉంటారని అంచనా రెండు రోజులపాటు గద్దెలపై కొలువుదీరిన తల్లులకు భక్తులు మొక్కులు చెల్లించి చుట్టూ పచ్చని వనం ఆ వనంలో కొలువైన తల్లుల సన్నిధిలో భక్తులు కుటుంబ సభ్యులతో వచ్చి 2 రోజుల పాటు సంతోషంగా గడిపారు మూడు రోజుల పాటు శివశక్తుల పూనకాలు భక్తుల డోలు వాయిద్యాలు నడుమ జాతర ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది ఆదివాసీ గిరిజన పూజారులు వారి సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించి తిరిగి తల్లులను వనంలోకి చేర్చారు.
గూడూరు మండలం మట్టేవాడ లో సారలమ్మ ను, జాతర కు తూర్పు దిక్కున ఉన్న సూర్యుని గుట్టలో సమ్మక్కను, జగన్నాయకుల గూడెంలో పగిడిద్దరాజును వన ప్రవేశం చేశారు. దేవతలు వనంలోకి ప్రవేశించడంతో జాతర ముగిసింది శనివారం ఉదయం వరకు భక్తులతో కిక్కిరిసిన జాతర ప్రాంగణం దేవతలు వనం లోకి ప్రవేశించడంతో జాతర పరిసర ప్రాంతాలు మొత్తం ఒక్కసారిగా మూగబోయాయి. ఈ జాతరలో గూడూరు తాహసిల్దార్ నాగ భవాని , డిప్యూటీ తహసీల్దార్ కోమల గూడూరు సిఐ సూర్యప్రకాశ్ , ఎస్సై గిరిధర్ రెడ్డి అటవీ శాఖ అధికారి సురేష్ మరియు వారి సిబ్బంది జాతర జరిగిన మూడు రోజుల పాటు నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూశారు. ఈ జాతరకు సహకరించిన అధికారులకు అందరికీ జాతర కమిటీ మరియు పూజారుల సంఘం వారి ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు.






