- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మక్క-సారలమ్మ జాతర ఎఫెక్ట్.. సర్పంచుల ట్రైనింగ్ ఫిబ్రవరి 10కి వాయిదా
తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందడి నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా మేడారం సమ్మక్క-సారలమ్మ (Sammakka-Saralamma) మహా జాతర సందడి నెలకొంది. ప్రతి పల్లె ఇప్పటికే అమ్మవార్లను దర్శించుకోవడానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక జనవరి 18న మేడారంలోని హరిత హోటల్‌లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ క్రమంలోనే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ములుగు జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచుల శిక్షణా కార్యక్రమాన్ని వాయిదా వేశారు. వాస్తవానికి జనవరి మూడవ వారంలో ప్రారంభం కావాల్సిన ఈ శిక్షణా తరగతులను, జాతర ఏర్పాట్లు, భక్తుల రద్దీ దృష్ట్యా ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా జిల్లా అధికారులు ప్రకటించారు.
కాగా, మేడారం మహా జాతర ఈ నెల 28న ప్రారంభమై 31 వరకు కొనసాగనుంది. దీంతో జిల్లా యంత్రాంగం మొత్తం జాతర ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. పంచాయతీరాజ్ శాఖకు చెందిన డీపీవోలు, డీఎల్‌పీవోలు, ఇతర సిబ్బందికి జాతరలో ప్రత్యేక విధులను కేటాయించారు. వారంతా జాతర ముగిసే వరకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. కోట్లాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లాలోని వనరులన్నీ జాతరకే కేటాయించడంతో, శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం ఇబ్బందికరంగా మారుతుందని అధికారులు భావించి సర్పంచుల శిక్షణా కార్యక్రమాన్ని ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు.






