- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రౌడీ హీరోతో రొమాన్స్ చేయనున్న సమంత.. ఆ సినిమాలోనే..?

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు సినిమాల విషయంలో వేగం పెంచింది. ఒకదాని తర్వాత ఒకటిగా వరుస సినిమాలను లైన్‌లో పెట్టేస్తోంది. అయితే తాజాగా రౌడీ హీరోతో రొమాన్స్‌కు ఓకే చెప్పిందట. 'టక్ జగదీష్' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేయనున్న సినిమాలో సమంత ఓకే అయిందట. శివ నిర్వాణ పక్కా హిట్ అందించే స్టోరీతో వచ్చాడని, అందుకనే ఇద్దరు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని టాక్.
శివ డైరెక్షన్‌లో సమంత ఇదివరకే 'మజిలి' మూవీ చేసింది. అదే విధంగా 'మహానటి' మూవీలో విజయ్, సామ్ కలిసి నటించారు. దీంతో వీరి మధ్య కెమిస్ట్రీకి ఇబ్బంది లేదని అభిమానులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు ఏమీ రాలేదు. మరి మేకర్స్ త్వరలో ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Next Story






