సమంత ఘాటు రిప్లై.. మీ పని మీరు చూసుకోండి అంటూ..

by Dishanational2 |
సమంత ఘాటు రిప్లై.. మీ పని మీరు చూసుకోండి అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్ : చైతో విడాకుల తర్వాత సామ్ తన కెరీయర్‌పై దృష్టి పెట్టి వరస సినిమాలాతో చాలా బీజీ అయిపోతుంది. అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. ఇటీవల క్రిటిక్ ఛాయిస్ అవార్డు వేడుకల్లో సామ్ రెడ్ కార్పెట్ పై ఆకుపచ్చ రంగు డిజైనర్ దుస్తుల్లో తళుక్కున మెరిసిన విషయం తెలిసిందే. ఇక అవార్డు వేడుకల్లో ఈ అమ్మడు అందానికి అందరూ ఫిదా అయిపోయారు. అయితే కొందరు సమంత డ్రెస్సింగ్‌పై ట్రోల్స్ చేశారు. విడాకుల తర్వాత సామ్ పూర్తిగా మారిపోయింది అటూ పలువిధాలు‌గా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

కాగా, తనపై వచ్చిన ట్రోల్స్‌కు చెక్ పెడుతూ.. సామ్ కామెంట్స్‌, ట్రోలింగ్‌పై ఇన్ స్టా స్టోరి వేదికగా ఘాటుగా స్పందించింది. మహిళలు ధరించే హేమ్ లైన్,నెక్ లైన్ దుస్తుల ఆధారంగా స్త్రీ ఉద్దేశాల్ని చెప్పడం మానేయండి. మహిళలు ధరించే దుస్తుల్ని బట్టి వారి ఆలోచన విధానం ఇలాగే ఉంటుందని అంచనా వేడయం మూర్ఖత్వం అవుతుంది. అలా చెప్పడం సరైనది కాదు, అలాంటి మనస్తత్వం ఉన్నవారు ఇప్పడే దాన్ని వదిలేయండి అని పేర్కొంది. అంతే కాకుండా ఒక వ్యక్తిని విమర్శించే ముందు ఆ వ్యక్తి బాధ పడకుండా, విమర్శ చేయాలి కానీ ఇతర వ్యక్తిని పట్టించుకోకుండా మీకు నచ్చిన విధంగా ట్రోల్స్ చేయం కరెక్ట్ కాదు ఈ ట్రోల్స్ చేయడం వదిలేసి మీ పని మీరు చూసుకోండి అంది. అలాగే ఇతర వ్యక్తికి ఇబ్బంది కలగకుండా విమర్శ ఉండాలి అంది. కామెంట్ చేయడం తప్పు కాదు కానీ అది గౌవరవ ప్రధాంగా ఉండాలి. మన ఐడియాలు ఒకరిపై రుద్దడం ఎంతవరకు సరైనది.. కామెంట్ చేయడం చాలా ఈజీ, ఇలా కామెంట్స్ చేయడం కన్న సమాజం మంచి కోసం ప్రయత్నిస్తే బాగుంటుంది. అంటూ సామ్ రిప్లే ఇచ్చింది. ప్రస్తుతం సామ్ రిప్లై కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీనిపై కొందరు సపోర్టు చేస్తూ కామెంట్ చేస్తే మరికొందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.



కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేనా..? మీ అభిప్రాయం తెలపడానికి క్లిక్ చేయండి

https://bit.ly/3q199uV


Next Story

Most Viewed