ఆ ఈవెంట్‌కు సమంత డుమ్మా.. మీడియాకెక్కిన విజయ్ దేవరకొండ

by Dishanational2 |
ఆ ఈవెంట్‌కు  సమంత డుమ్మా.. మీడియాకెక్కిన విజయ్ దేవరకొండ
X

దిశ, వెబ్‌డెస్క్ : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 11వ చిత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. దర్శకులు హరీష్ శంకర్, బుచ్చిబాబు సన తదితరులు ఈ వేడుకకు హాజరైనప్పటికీ, సినిమాలో హీరోయిన్‌గా నటించిన సమంత మాత్రం ఈ ఫంక్షన్‌కు అటెండ్ కాలేదు. లాంచ్ ఈవెంట్‌లో సమంత లేకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అటు సోషల్ మీడియాలో పలు ఊహాగాలు వెలువడుతున్నాయి. సమంత ప్రస్తుతం దుబాయ్‌లో ఉంది అందుకే సామ్ ఈ ఫంక్షన్‌కు అటెండ్ కాలేదంటూ పలు వార్తలు నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సందడిని ఆపేందుకు విజయ్ దేవరకొండ్ ఎంటర్ అయ్యాడు. సమంతతో పాటు హాస్యనటులు, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ ముఖాలను జోడించి లాంచ్ ఈవెంట్ మార్ఫింగ్ చిత్రాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు విజయ్.

"అసలు పూజా ఫోటో! డార్లింగ్స్ @సమంతప్రభు2, @vennelakishore @eyrahul తో.. ఈ ఫోటోను షేర్ చేయమని ప్రెస్‌ని రిక్వెస్ట్ చేస్తున్న. ధన్యవాదాలు" అని విజయ్ ట్వీట్ చేశాడు. విజయ్ ట్వీట్‌కి సమంత నవ్వు ఎమోజీలను పోస్ట్ చేసింది.

Next Story