ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగిన సలార్ సినిమా షూటింగ్..!

by Disha Web Desk 19 |
ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగిన సలార్ సినిమా షూటింగ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్. ఇటీవలే పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాధేశ్యామ్‌ సినిమా ఊహించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ చిత్రంలో ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్లు యాక్షన్ సీన్స్ లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం డార్లింగ్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సలార్ మూవీ షూటింగ్‌కు బ్రేక్‌లు పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఓ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లడం.. దానిని నుంచి పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ప్రస్తుతం షూటింగ్ ఆగినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే మేకర్స్ సలార్ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.. ప్రస్తుతం సినిమా 60శాతం చిత్రీకరణ కూడా పూర్తి కాకపోవడంతో వచ్చే ఏడాది కూడా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ యాక్షన్ మూవీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మాత్రం ఇది చేదువార్తే.

Next Story

Most Viewed