మత స్వేచ్ఛ Vs రాజ్యాంగ నైతికత.. శబరిమల వివాదం కేసులో సుప్రీంకోర్టు బిగ్ అప్‌డేట్

by Malleboina Mahesh |

శబరిమల ఆలయ ప్రవేశం మరియు మతపరమైన హక్కులపై సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఏప్రిల్ 7, 2026 నుండి విచారణ ప్రారంభించనుంది. ఏప్రిల్ 22 నాటికి వాదనలు పూర్తి చేయాలని కోర్టు స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రకటించింది.

మత స్వేచ్ఛ Vs రాజ్యాంగ నైతికత.. శబరిమల వివాదం కేసులో సుప్రీంకోర్టు బిగ్ అప్‌డేట్
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో ఉన్న ప్రముక పుణ్యక్షేత్రాల్లో కేరళలో ఉన్న శబరిమల అయ్యస్ప స్వామి ఆలయం (Sabarimala Ayyappa Swamy Temple) ఒకటి. అయితే ఈ ఆలయంలో మహిళలకు ప్రశేవం గతం కొద్ది సంవత్సరాల కింద భారీ చర్చ జరిగడంతో పాటు వివాదం నెలకొన్ని సుప్రీం కోర్టుకు చేరిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపుతున్న శబరిమల ఆలయ ప్రవేశం, మతపరమైన స్వేచ్ఛకు సంబంధించిన కీలక రాజ్యాంగపరమైన అంశాలపై సుప్రీంకోర్టులో విచారణకు ముహూర్తం ఖరారైంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ వివాదంపై ఏప్రిల్ 7, 2026 (మంగళవారం) ఉదయం 10:30 గంటలకు తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణను ప్రారంభించనుంది. కేవలం శబరిమల అంశమే కాకుండా, వివిధ మత విశ్వాసాలకు సంబంధించిన ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ నైతికత, మతపరమైన ఆచారాల మధ్య ఉన్న సంబంధంపై కోర్టు విస్తృత స్థాయిలో చర్చించనుంది.

ఈ విచారణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 7 నుండి 9 వరకు రివ్యూ పిటిషన్లకు మద్దతు ఇచ్చే పక్షాల వాదనలు వింటారు. అనంతరం ఏప్రిల్ 14 నుండి 16 వరకు ఆ పిటిషన్లను వ్యతిరేకించే పక్షాల వాదనలు జరుగుతాయి. ఏప్రిల్ 21న తుది వాదనలు, ఏప్రిల్ 22న అమికుస్ క్యూరీ సమర్పణలతో విచారణ ముగుస్తుంది. ఈ సమయపాలనను ఖచ్చితంగా పాటించాలని, వాదనలు సమర్పించే కౌన్సిల్స్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం ఈ విచారణలో కేంద్ర ప్రభుత్వం కూడా రివ్యూ పిటిషన్లకే మద్దతు ఇస్తుండటం గమనార్హం. 2018లో అన్ని వయసుల మహిళలకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ అప్పటి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఇప్పుడు మళ్ళీ సవాలు చేస్తున్నారు. మరోవైపు, ఒరిజినల్ రిట్ పిటిషనర్లు పాత తీర్పునే సమర్థించాలని కోరుతున్నారు. మత స్వేచ్ఛ, సమానత్వానికి సంబంధించిన రాజ్యాంగ పరిధిని ఈ తీర్పు తేల్చనుండటంతో దేశవ్యాప్తంగా ఈ ఏప్రిల్ విచారణలపై ఉత్కంఠ నెలకొంది.

Next Story