'రష్యా ఆహారాన్ని ఓ ఆయుధంలా వినియోగిస్తోంది'

by Dishafeatures2 |
రష్యా ఆహారాన్ని ఓ ఆయుధంలా వినియోగిస్తోంది
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పలు దేశాల్లో ఆహార కొరత ఏర్పడింది. ధాన్యం ఎగుమతులను రష్యా పూర్తిగా నిలిపివేయడంతో ఆహార కొరత మరింత అధికం అవుతోంది. అయితే ఈయూ రష్యాపై వరుస ఆంక్షల ప్యాకేజీలను విధించింది. వాటిల్లో భాగంగా రష్యా దిగుమతుల, ఎగుమతులపై కూడా తీవ్ర ఆంక్షలు పెట్టింది. దాంతో రష్యా ధాన్యం ఎగుమతులను పూర్తిగా నిలిపివేసింది. అయితే తాజాగా రష్యాపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికాలోని కామెరూన్‌లో పర్యటించేందుకు ఫ్రెంచ్ అధ్యక్షుడు మంగళవారం వెళ్లారు. అక్కడ సభలో మాట్లాడిన మాక్రోన్.. రష్యా ఆహారాన్ని యుద్ధంలో ఓ ఆయుధంలా వినియోగిస్తోందని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో చాలా దేశాలు ఉక్రెయిన్‌ను మద్దతు ఇస్తున్నాయి. అందుకని రష్యా ఆహార సంక్షోభాన్ని తన ఆయుధంగా మార్చుకుని శత్రుదేశాలపై పైచేయి సాధించాలని చూస్తోందని ఇప్పటికే పలు దేశాల నాయకులు అన్నారు. అయితే ప్రపంచంలో ఏర్పడుతున్న ఆహార సంక్షోభానికి తాను బాధ్యత వహించనని రష్యా తేల్చి చెప్పింది. దాంతో పాటుగా ఓడరేవులకు సంబంధించిన విధానాలను మైనింగ్ చేసినందుకు ఉక్రెయిన్‌ను నిందించింది.


Next Story

Most Viewed