Ileana: ఆ హీరోయిన్‌ తమ్ముడితో ఇలియానా డేటింగ్‌!

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-06-13 14:52:20  IST  )

Rumors On Ileana Dating with Katrina's Brother Sebastien Laurent Michel| ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తనకు బీచ్ అంటే మహా ఇష్టం కాగా.. ఎప్పుడూ అక్కడే గడుపుతుంటుంది

Rumors On Ileana Dating with Katrinas Brother Sebastien Laurent Michel
X

దిశ, సినిమా : Rumors On Ileana Dating with Katrina's Brother Sebastien Laurent Michel| ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తనకు బీచ్ అంటే మహా ఇష్టం కాగా.. ఎప్పుడూ అక్కడే గడుపుతుంటుంది. రీసెంట్‌గా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పుట్టిన రోజు వేడుకలు మాల్దీవ్స్‌లో జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడకలో తను పాల్గొన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఇలియానా. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. కత్రినా సోదరుడు సెబాస్టియన్‌తో ఇలియానా డేటింగ్ చేస్తుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఇల్లీ బేబీ 'ఆండ్రూ నీబోన్‌'తో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయగా.. ఆ తర్వాత పలు కారణాలతో విడిపోయారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ముంబై విమానాశ్రయంలో సెబాస్టియన్-ఇలియానా కలిసే బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో ఇలియానా, సెబాస్టియన్ ప్రేమలో ఉన్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Next Story